బిగ్ బాస్ సీజన్ -8 లో మొదట్లో కాస్త బోరింగ్ అనిపించింది. ఆ తర్వాత అయిదవ వారంలో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక.. షో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా అవినాష్, తేజ, రోహిణీల కామెడీ టైమింగ్ తో మరింత ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అవినాష్ తన కామెడీతో అటు హౌస్ మేట్స్, ఇటు ప్రేక్షకులను నవ్వించేసాడు.
అవినాష్ ఒక కామెడీలోనే కాదు.. గేమ్ లో కూడా తన సత్తాచాటి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ టాప్-5 లో ఉండగా.. ఫినాలేలో మొదట ఎలిమినేషన్ అయ్యాడు. అవినాష్ బజ్ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. మొదట ఫైనలిస్ట్ అయ్యాక నీకు ఫీలింగ్ ఎలా ఉందని యాంకర్ అర్జున్ అడగ్గా.. నేను బ్యాక్ టూ బ్యాక్ కంటెండర్ అయ్యాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందని అవినాష్ అన్నాడు. హౌస్ లో మిమ్మల్ని సుడిగాడు అని అంటే ఒప్పుకుంటారా అని యాంకర్ అడగ్గా.. ఖాళీ గా కూర్చొని ఉంటే మాత్రం టికెట్ టూ ఫినాలే రాలేదని కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చాడు అవినాష్. నాకు ఏదో పాజిటివ్ వైబ్ ఉందని అవినాష్ అనగానే.. విష్ణుప్రియతో ఫ్రెండ్ షిప్ చేసావా ఏంటి తనలా మాట్లాడుతున్నావని యాంకర్ అంటాడు. సీజన్ 4 లో ఫినాలే వీక్ వన్ వీక్ అనగా వచ్చేసావ్.. ఇప్పుడు ఫినాలే వీక్ వరకు ఉండి టైటిల్ మిస్ అయ్యావ్.. ఏదైనా బాధగా ఉందా అని యాంకర్ అడగ్గా.. ఖచ్చితంగా బాధ ఉంటుందన్నాడు అవినాష్.
నామినేషన్ అంటే భయపడుతున్నావా అని అర్జున్ అనగానే.. జనాలు నామినేషన్ కి వస్తే ఆట బాగా ఆడుతున్నారని ఓటు వేసి సేవ్ చేస్తున్నారా లేక టెలికాస్ట్ అయినా వీడు ఆట బాగా ఆడుతున్నాడు.. వీడికి ఓటు వెయ్యాలని డిసైడ్ చేస్తున్నారా అని అవినాష్ అంటాడు. అది నువ్వు బయటకు వెళ్ళాక నీ అట నువ్వు చూసుకుంటే తెలుస్తుందని యాంకర్ అన్నాడు. ఆడాను కాబట్టే పదిహేడు మంది బయట ఉన్నారు.. నేను టాప్-5 లో ఉన్నాను. నేను ఈ టాప్-5 కి వచ్చి ఆగిపోయానంటే నాకు ఓటు బ్యాంకింగ్ లేకపోవడమే అని అవినాష్ అన్నాడు. స్టేజ్ పైన ఏంటి ఇందాక మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి వస్తానంటున్నావ్.. ఇక వదలవా బిగ్ బాస్ ని అని యాంకర్ పంచ్ వేయగా.. అవినాష్ నవ్వుకున్నాడు. అయితే జెన్యున్ ఆడిన అవినాష్ కి స్ట్రాంగ్ పీఆర్ లేకపోవడం, ఓట్ బ్యాంకింగ్ లేకపోవడమే పెద్ద మైనస్. లేదంటే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన హౌస్ మేట్స్ లో అవినాష్ ఫస్ట్ ఉంటాడు.